ఆకలి తీర్చనున్న అన్న క్యాంటీన్లు
ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఆయన సచివాలయంలో తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహించేందుకు సంబంధించిన తొలి సంతకం చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు.
యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో స్కిల్ సెన్సెస్ ఫైలుపై సిగ్నేచర్ చేశారు. ఇదే సమయంలో రూ. 4 వేల పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ఇక నుంచి పెన్షన్ రూ. 7 వేల రూపాయలు అందుతాయి.
ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన దివంగత నందమూరి తారక రామారావు పేరుతో అన్న క్యాంటీన్లను జగన్ సర్కార్ రద్దు చేసింది. తిరిగి టీడీపీ ప్రభుత్వం కొలువు తీరడంతో అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఫైలు పై సంతకం చేశారు.