బాబుకు రిచర్డ్ రోసోవ్ కంగ్రాట్స్
అద్భుతమైన నాయకుడంటూ కితాబు
అమెరికా – యుఎస్ – ఇండియా పాలసీ స్టడీస్ చైర్ డైరెక్టర్ అమెరికాకు చెందిన రిచర్డ్ రోసోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అపారమైన అనుభవం కలిగిన గుర్తింపు ఉంది. గతంలో ఏపీ సీఎంగా పని చేసిన సమయంలో నారా చంద్రబాబు నాయుడును రిచర్డ్ రోసోవ్ కలుసుకున్నారు. దూర దృష్టి, అభివృద్ది, సాంకేతికతపై మరింత దృష్టి పెట్టేలా సీఎంగా ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రిచర్డ్ రోసోవ్ 2014లో చంద్రబాబును కలుసుకున్నారు. ఇదే సమయంలో 2024లో ఏపీ సీఎంగా కొలువు తీరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, సినీ , రాజకీయ, వ్యాపార, వాణిజ్య , క్రీడా రంగాలకు చెందిన వారంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు.
నిన్న ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా , వేదాంత లిమిటెడ్ అంతర్జాతీయ కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ తో పాటు శుక్రవారం రిచర్డ్ రోసోవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభినందనలతో ముంచెత్తారు చంద్రబాబు నాయుడును.