స్పీకర్ రేసులో అయ్యన్న ?
బుచ్చయ్య చౌదరి పేరు కూడా
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ఊహించని విజయాన్ని వరించింది కూటమికి.
గతంలో కంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టారు ప్రజలు. మొత్తం 175 సీట్లకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లు లభించాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ తో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కీలకమైన శాఖలన్నీ పవన్ వద్దే ఉన్నాయి.
దీని వెనుక అమిత్ చంద్ర షా ప్లాన్ ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇక కీలకమైన చట్టాలకు ఆమోదం తెలపడం, సభను సజావుగా నిర్వహించేలా చూసే కీలకమైన బాధ్యత శాసన సభ స్పీకర్ పై ఉంటుంది. ఈసారి కేబినెట్ లో ఊహించని రీతిలో టీడీపీ సీనియర్లకు చోటు దక్కలేదు.
ప్రధానంగా జగన్ రెడ్డి దాష్టీకాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఏకైక నాయకుడు అయ్యన్న. ఆయనకు చోటు దక్కక పోవడం విస్తు పోయేలా చేసింది. దీంతో స్పీకర్ పోస్టుకు ఇవ్వనున్నట్లు టాక్.