NEWSANDHRA PRADESH

ఆత్మ విమ‌ర్శ చేసుకుంటే బెట‌ర్

Share it with your family & friends

సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌చివాల‌యంలో కొలువు తీరిన అనంత‌రం త‌న‌ను క‌లిసిన వారిని అభినందించారు. పుష్ప గుచ్ఛాలు స్వీక‌రించారు. అనంత‌రం ఐఏఎస్, ఐపీఎస్ సీనియ‌ర్ ఆఫీస‌ర్ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

గ‌త ఐదేళ్ల కాలంలో ఎలా ప‌ని చేశార‌నే దానిపై ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఎంత నిర్ద‌యగా వ్య‌వ‌హ‌రించారో త‌లుచుకుంటేనే బాధ క‌లుగుతోంద‌ని పేర్కొన్నారు.

కేవ‌లం క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించిన గ‌త సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఆయ‌న ప‌రివారానికి వ‌త్తాసు ప‌లికార‌ని, ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, అజ‌య్ జైన్, శ్రీ‌ల‌క్ష్మి ల‌కు బిగ్ షాక్ ఇచ్చారు. వారు ఇచ్చిన పుష్ప గుచ్ఛాల‌ను తీసుకోలేదు. దీంతో వారంతా వెనుదిరిగారు.