ఐఏఎస్ శ్రీలక్ష్మికి సీఎం షాక్
పుష్ప గుచ్ఛాన్ని తీసుకోని బాబు
అమరావతి – జగన్ సర్కార్ లో చక్రం తిప్పిన, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కోలుకోలేని షాక్ తగిలింది. తాజాగా వైసీపీ సర్కార్ కు బదులు ఎన్డీయే కూటమి పవర్ లోకి వచ్చింది. ఈ సందర్బంగా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు కొలువు తీరారు. సచివాలయంలో ఆయన 5 ఫైళ్లపై సంతకాలు చేశారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడును పలువురు సీనియర్ ఆఫీసర్లు , పోలీసు ఉన్నతాధికారులు కలిశారు. వీరిలో ముగ్గురు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లతో సీనియర్ ఐపీఎస్ అధికారికి ఘోరమైన అవమానం జరిగింది.
ఈ ముగ్గురూ జగన్ చెప్పినట్టు ఆడారని, వారికి మేలు చేకూర్చేలా తమను ఇబ్బందులకుగ ఉరి చేసేలా వ్యవహరించారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఆయనకు పుష్ప గుచ్ఛాలు ఇచ్చేందుకు వెళ్లారు అజయ్ జైన్ , శ్రీలక్ష్మి, పీఎస్ఆర్ ఆంజనేయులు.
ఇదిలా ఉండగా పుష్ప గుచ్చం ఇవ్వ బోయిన శ్రీలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. తీసుకునేందుకు ఒప్పుకోలేదు సీఎం చంద్రబాబు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.