ఓడి పోయినా ప్రశ్నిస్తూనే ఉంటాం
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
అమరావతి – మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఓడి పోయినందుకు బాధ పడటం లేదన్నారు. శుక్రవారం ఆమె ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని పేర్కొన్నారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమేనని స్పష్టం చేశారు ఆర్కే రోజా సెల్వమణి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. అయినా ప్రజలు తమను ఆదరించ లేదని, దీనిపై తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి.
చెడు చేసి ఓడి పోతే సిగ్గు పడాలి..కానీ మేం ప్రతి ఒక్కరికీ ఏదో రకంగా మేలు చేకూర్చే ప్రయత్నం చేశామని తెలిపారు. అయితే మంచి చేసి ఓడి పోవడం ఒకింత బాధ కలిగించిందని అన్నారు . ఓటమి చెందినందుకు కృంగి పోవడం లేదని, తాము ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.