విద్యా శాఖపై సీఎం నిర్లక్ష్యం
రాణి రుద్రమ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై సాకింగ్ కామెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి. ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎంను ఏకి పారేశారు.
ప్రజా పాలన సాగిస్తున్నామంటూ పదే పదే గొప్పలు చెపుతూ జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ కీలకమైన విద్యా శాఖపై ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు రాణి రుద్రమ రెడ్డి.
ఈ ప్రభుత్వంలో మద్యానికి మంత్రి ఉంటాడు కానీ కీలకమైన విద్యా శాఖకు మంత్రిని కేటాయించక పోవడం దారుణమన్నారు. ఇలాంటి సోయి లేని సీఎం ఉండడం ప్రజలకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు.
ఓ వైపు స్కూళ్లు, కాలేజీలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయని వాటిపై నియంత్రణ లేకుండా పోయిందన్నారు రాణి రుద్రమ రెడ్డి.