బైరెడ్డి..రోజాలపై విచారణ చేపట్టాలి
ఆడుదాం ఆంధ్రాలో రూ. 100 కోట్లు మోసం
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అన్ని శాఖలపై ఫోకస్ పెట్టారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు.
ఇందులో భాగంగా ఏపీ సీఐడీకి గత సర్కార్ లో నిర్వహించిన ఆంధ్రా ఆడుదాం కార్యక్రమంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డితో పాటు మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ మేరకు ఆధారాలతో సహా లేఖ అందజేసింది. రోజా, బైరెడ్డిలను వెంటనే విచారించాలని డిమాండ్ చేసింది. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడా పోటీలను నిర్వహించింది. ఇందులో రూ. 100 కోట్లకు పైగా చేతులు మారాయని, ఈ మొత్తం వ్యవహారం వెలుగు లోకి రావాల్సిన అవసరం ఉందని ఆరోపించింది.