వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్
పోలీస్ శాఖపై తీవ్ర ఆగ్రహం
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనింత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానంగా పోలీసు శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ రెడ్డి సర్కార్ కు తాబేదారులుగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక రకంగా తనకు తీవ్ర అవమానం జరిగిందని వాపోయారు. తన లాంటి వారికే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. పోలీస్ ఉన్నతాధికారులలో కొందరు తమ పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. లేక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో తాను ఫిర్యాదు ఇవ్వాలని డీజీపీ ఆఫీసుకు వెళ్లానని , అనుమతి ఇవ్వలేదని వాపోయారు. చివరకు కానిస్టేబుల్ కు లేఖ ఇచ్చుకోండి అంటూ చెప్పారని మండిపడ్డారు.
ఇక నుంచి ప్రజా పాలన మొదలు కానుందని అన్నారు. ఆరోజు తాను ఛాలెంజ్ చేశానని, ప్రోటో కాల్ తో తాను ఇక్కడికి వస్తానని , ఇదే ఇప్పుడు జరిగిందని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.