పోలీస్ శాఖపై అనిత నజర్
వేధింపులపై తీవ్ర ఆగ్రహం
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రిగా కొలువు తీరిన వెంటనే దూకుడు పెంచారు వంగలపూడి అనిత. ప్రత్యేకించి ఆమె పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులతో కీలక సమీక్ష చేపట్టారు. ఒకానొక దశలో సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇదిలా ఉండగా వంగలపూడి అనితను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఏలూరు రేంజ్ ఐజీ జీవీ అశోక్ కుమార్, అంబేద్కర్ జిల్లా ఎస్పీ శ్రీధర్, ఏఎస్పీ ఖాదర్ భాషా. గత ప్రభుత్వ హయాంలో తమ పార్టీకి చెందిన నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులను టార్గెట్ చేసి తీవ్రైమన వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో పోలీసు శాఖలో కొందరు గత సర్కార్ కు వైసీపీ కార్యకర్తలు లాగా పని చేశారంటూ మండిపడ్డారు. వారందరీ పేర్లు తమ రెడ్ బుక్ లో ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ అన్ని శాఖలను భ్రష్టు పట్టించారంటూ ధ్వజమెత్తారు వంగలపూడి అనిత.