భద్రతా వైఫల్యం దారుణాలు దారుణం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు, ఘటనలు, మర్డర్లు, మానభంగాలకు సంబంధించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలం కావడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లో జరిగిన బాలిక అత్యాచారంతో పాటు నారాయణపేట జిల్లా ఊట్కూరులో చోటు చేసుకున్న ఘటన సభ్య సమాజం తల దించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత.
ఈ కేసులను వెంటనే ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణకు ఆదేశించాలని, నిందితులకు శిక్ష పడేలా చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో విఫలం కావడం బాధాకరమని పేర్కొన్నారు.