ఇక అమరావతికి పూర్వ వైభవం
తీసుకు వస్తామన్న మంత్రి నారాయణ
అమరావతి – ఏపీ రాష్ట్ర మంత్రి పొనుగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతిని పట్టించు కోలేదని ఆవేదన చెందారు. ఇక నుంచి అలాంటి దిగులు పడాల్సిన అవసరం రైతులకు కలగదన్నారు మంత్రి.
ఏపీకి ఒకే ఒక్క రాజధాని ఉంటుందని, ఆ కేపిటల్ సిటీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తెలుసన్నారు. ఇక నుంచి ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని తమ నాయకుడు నారా లోకేష్ ప్రకటించారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు పొంగూరు నారాయణ.
రాజధాని అమరావతి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ నివేదిక రావడానికి రెండు లేదా మూడు నెలల సమయం పడుతుందని చెప్పారు. మరో 10 రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు.
ఇక అమరావతి నిర్మాణాన్ని రెండున్నర ఏళ్లలో పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.