ప్రజా సమస్యలపై పోరాడాలి
పార్టీ శ్రేణులకు జగన్ నిర్దేశం
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజాగా వెల్లడైన ఫలితాలు ఆశాజనకంగా లేనప్పటికీ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తన క్యాంపు కార్యాలయంలో జగన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో 40 శాతం ప్రజలు వైసీపీని కోరుకున్నారని, కానీ ఏం జరిగిందో తెలియదు కానీ మనకు ఓటమి దక్కిందన్నారు. విచిత్రం ఏమిటంటే దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేశామని అన్నారు.
అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఏకంగా రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేశామని ప్రజలు ఆదరించక పోవడం దారుణమన్నారు జగన్ మోహన్ రెడ్డి. వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నేతలు నిరాశకు లోను కావద్దంటూ సూచించారు మాజీ సీఎం.