NEWSTELANGANA

జ‌గ‌న్ అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత

Share it with your family & friends

హైద‌రాబాద్ లో మాజీ సీఎంకు షాక్

హైద‌రాబాద్ – ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది తెలంగాణ స‌ర్కార్. ఆయ‌న ఏపీలో ఊహించ‌ని రీతిలో ఓట‌మి పాల‌య్యారు. తాజాగా హైద‌రాబాద్ లోని జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద శ‌నివారం అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చి వేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) జ‌గ‌న్ రెడ్డి ఆక్ర‌మించి క‌ట్టుకున్న క‌ట్ట‌డాల‌ను కూల్చి వేసింది. ఇవాళ‌ లోటస్ పాండ్‌లోని జగన్ మోహన్ రెడ్డి నివాసం. జగన్ భద్రత కోసం అనధికార నిర్మాణాలు చేప‌ట్టింది. విచిత్రం ఏమిటంటే ప్ర‌భుత్వ ఆధీనంలోని రోడ్డును ఆక్ర‌మించారు. దీంతో స్థానికుల రాక పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది.

ప్ర‌జ‌లు చేసిన ఫిర్యాదు మేర‌కు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ఈ మేర‌కు ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చి వేశారు.
ట్రాఫిక్‌ను సులభతరం చేసే చర్యను స్థానికులు స్వాగతించగా, జగన్ భద్రత కోసం గదులు అవసరమని ఆయన మద్దతుదారులు వాదించారు.

అయినా జీహెచ్ఎంసీ అధికారులు ప‌ట్టించు కోలేదు. జ‌గ‌న్ అయినా లేదా చంద్ర‌బాబు అయినా ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డితే కూల్చి వేస్తామ‌ని ప్ర‌క‌టించారు.