|అరుంధతి రాయ్ పై ప్రియాంక ఫైర్
ఆమె వ్యాఖ్యలు పూర్తిగా అర్ధ రహితం
ముంబై – శివసేన యుబిటి నాయకురాలు ప్రియాంక చతుర్వేది సీరియస్ కామెంట్స్ చేశారు. ఆమె శనివారం జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇది భారత దేశానికి చెందిన అంశమని పేర్కొన్నారు.
ఇవాళ అయినా లేదా రేపటికైనా జమ్మూ కాశ్మీర్ అనేది భారత దేశంలో అంతర్భాగమని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరుంధతి రాయ్ మాట్లాడటం అలవాటుగా మారిందని ఆరోపించారు.
ఏదైనా ఉంటే ఆధారాలతో సహా నిరూపించాలని ప్రియాంక చతుర్వేది. జమ్మూ కాశ్మీర్ సమస్య ఈనాటిది కాదని గుర్తు చేసుకోవాలన్నారు. ఇది కొన్నేళ్లుగా నాన్చుతూ వస్తోందని , కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఏది ఏమైనా అరుంధతి రాయ్ అంటే తమకు కూడా గౌరవం ఉందని , కానీ అనవసర విషయాలు పట్టించు కోక పోవడం మంచిదన్నారు.