టికాయత్ ఆశీర్వాదం ఇక్రా సంతోషం
కిషాన్ నేతతో ఎంపీ ములాఖత్
ఉత్తర ప్రదేశ్ – సమాజ్ వాది పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు ఇక్రా మునావర్ హసన్. ఆమె లండన్ లో చదువుకున్నారు. మంచి విద్యాధికురాలు. తాజాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలతో కూడిన కూటమి దుమ్ము రేపింది. కానీ అనూహ్యంగా అధికారానికి దూరమైంది.
ఇదిలా ఉండగా ఎంపీగా గెలుపొందిన వెంటనే ఇక్రా మునావర్ హసన్ నేరుగా ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికాయత్ నివాసానికి వెళ్లారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. భవిష్యత్తులో మీ సహకారం తనకు ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి టికాయత్ సంతోషం వ్యక్తం చేశారు.
రాజకీయాలకు అతీతంగా రైతులకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు టికాయత్. రైతు నాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు టికాయత్. రైతులు బాగు కోసం తన జీవితాన్ని అంకితం చేయడం అభినందనీయమన్నారు ఇక్రా మున్వార్ హసన్. ఆయనకు తను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని ప్రకటించారు. తనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు ఇక్రా.