మోదీ సర్కార్ కు బేషరతు మద్దతు
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కొత్తగా కొలువు తీరిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు.
మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చే బిల్లులకు సపోర్ట్ చేస్తామని తెలిపారు. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయానికైనా తాము అండగా ఉంటామని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
మా విధానంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తాజాగా ఏపీలో జరిగిన శాసన సభ , లోక్ సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
తమ పార్టీకి రాజ్య సభలో 11 మంది ఎంపీలు ఉన్నారని చెప్పారు మాజీ సీఎం. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ , టీఎంసీ తర్వాత వైసీపీ అత్యధిక స్థానాలు కలిగి ఉందన్నారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము మద్దతు తెలియ చేస్తూనే ఉంటామన్నారు.