గన్నవరం టు ముంబై సర్వీస్ స్టార్ట్
ప్రారంభించిన ఎంపీలు బాల శౌరి..చిన్ని
విజయవాడ – గన్నవరం విమానాశ్రయం నుండి ముంబైకి కొత్తగా ఏర్పాటు చేసిన విమాన సర్వీస్ ను ప్రారంభించారు నూతనంగా ఎన్నికైన ఎంపీలు బాల శౌరి, కేశినేని చిన్ని. ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో ఈ సర్వీస్ ప్రతి రోజూ గన్నవరం నుండి ముంబైకి వెళుతుంది. వ్యాపార, వాణిజ్య అవసరాలు పెరగడంతో మరింతగా ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉండేందుకు గాను ఎయిర్ ఇండియా ఈ సర్వీస్ ను ఏర్పాటు చేసింది.
ఇక నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రతి రోజూ ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా పలు సర్వీసులు ప్రారంభం అవుతాయని చెప్పారు ఎంపీలు శౌరి, చిన్ని. అమరావతి రాజధానికి నేరుగా ఇతర దేశాలకు వెళ్లేందుకు గాను అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు.
తమ కూటమికి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం విమానయాన శాఖను అప్పగించారని, ఇది కూడా త్వరలోనే నెరవేరుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఇక నుంచి ఏపీ అభివృద్ది పథంలోకి దూసుకు వెళ్లడం ఖాయమన్నారు.