అవిముక్తేశ్వరానంద షాకింగ్ కామెంట్స్
రాముడిని రాజకీయంగా వాడుకుంటే ఎలా
న్యూఢిల్లీ – శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సరైన స్థానాలు రాలేదు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మించిన శ్రీరాముడి ఆలయాన్ని ముందు పెట్టుకుని ప్రచారానికి వెళ్లింది. అంతే కాకుండా ఔర్ ఏక్ బార్ చార్ సౌ బార్ అంటూ నినాదంతో హోరెత్తించింది. చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ సంఖ్యను చేరుకోలేక పోయింది.
ముచ్చటగా మూడోసారి పీఎంగా కొలువు తీరిన నరేంద్ర దామోదర దాస్ మోడీ ప్రభావం రాను రాను తగ్గుతుందని తేలి పోయింది. విచిత్రం ఏమిటంటే ఏకంగా ఏ గుడిని అయితే కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారో ఆ అయోధ్యలోనే భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది.
ఏకంగా సమాజ్ వాది పార్టీ అభ్యర్థి చేతిలో 48 వేల ఓట్లకు పైగా తేడాతో పరాజయం పాలు కావడం విస్తు పోయేలా చేసింది. దీంతో బీజేపీకి, దాని పరివారమైన వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ , ఏబీవీపీకి కోలుకోలేని షాక్ తగిలింది.
ఈ సందర్బంగా శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద స్పందిస్తూ రాజకీయ వేడుకలను నిర్వహించడం ద్వారా రాముడిని ఉపయోగించుందంటూ వాపోయారు.