NEWSTELANGANA

నాన్న‌కు ప్రేమ‌తో కేటీఆర్

Share it with your family & friends

హ్యాపీ ఫాద‌ర్స్ డే డాడీ

హైద‌రాబాద్ – భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జూన్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా తండ్రుల దినోత్స‌వం (ఫాద‌ర్స్ డే ) నిర్వ‌హించడం కొన‌సాగుతూ వ‌స్తోంది. ఈ సంద‌ర్బంగా తండ్రులంద‌రికీ కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ఆదివారం స్పందించారు. ఈ సంద‌ర్భాన్ని పురస్క‌రించుకుని త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేటీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న‌నే కాదు త‌మ కుటుంబానికి ఆయ‌న నిత్యం స్పూర్తి దాయ‌కంగా ఉంటూ వ‌చ్చార‌ని కొనియాడారు.

పోరాట యోధుడిగా, నాయ‌కుడిగా, కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తూ వ‌స్తున్న మ‌హోన్న‌త వ్య‌క్తిగా ఎల్ల‌ప్ప‌టికీ చ‌రిత్ర‌లో నిలిచి పోతార‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. అరుదైన ఫోటోను షేర్ చేశారు. త‌న తండ్రి కేసీఆర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు.

దూర దృష్టి క‌లిగిన యోధుడిగా , తామంద‌రికీ త‌మ తండ్రి కేసీఆర్ రోల్ మోడ‌ల్ గా ఉంటార‌ని తెలిపారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.