NEWSANDHRA PRADESH

నారా లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్

Share it with your family & friends

స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఫోక‌స్

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న తాను ఎన్నిక‌ల్లో చెప్పిన విధంగానే ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. మంత్రిగా కొలువు తీరిన వెంట‌నే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.

ఆయ‌న అన్ని విధాలుగా అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ప్ర‌తి రోజూ ప్ర‌జ‌ల‌తో ముఖా ముఖి నిర్వ‌హిస్తాన‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు , స‌మ‌స్య‌లు ఉన్నా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు నారా లోకేష్.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజూ కూడా లోకేష్ “ప్రజాదర్బార్” నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి, పెన్షన్, ఉద్యోగాలు, ఉద్యోగస్తుల సమస్యలు ఇలా అనేక అంశాలు ప్రజలు త‌న‌ దృష్టికి తీసుకొచ్చార‌ని చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం చేస్తానని వారికి భ‌రోసా ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు నారా లోకేష్‌.