ప్యాలస్ కు రాకుండానే పోయాడు
గంటా శ్రీనివాస రావు షాకింగ్ కామెంట్స్
విశాఖపట్టణం – మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. మితి మీరిన అహంకారంతో విర్ర వీగాడని చివరకు జనం ఛీ కొట్టారని అయినా తెలివి రావడం లేదంటూ ఎద్దేవా చేశారు.
కోట్లాది ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. విశాఖ పట్టణంలోని రిషి కొండపై కళ్లు చెదిరేలా ప్యాలస్ కట్టుకున్నాడని మండిపడ్డారు. ఇది ఒక రకంగా సద్దాం హుసేన్ ప్యాలస్ ను తలపించేలా చేస్తోందన్నారు.
కోట్లు ఖర్చు చేసి కట్టించుకున్న ప్యాలస్ లోకి రాకుండానే దిగి పోయాడని జగన్ రెడ్డిపై సెటైర్ వేశారు గంటా శ్రీనివాస రావు. ప్రజలను విస్మరించిన ఏ నాయకుడు విజయం సాధించిన దాఖలాలు లేవన్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమని, తను ఇప్పటికైనా మారితే మంచిదని సూచించారు మాజీ మంత్రి.