NEWSNATIONAL

నీట్ నిర్వాకం కేటీఆర్ ఆగ్ర‌హం

Share it with your family & friends

బీజేపీ స‌ర్కార్ పై విచార‌ణ చేప‌ట్టాలి

హైద‌రాబాద్ – దేశంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన నీట్ ప‌రీక్షా పేప‌ర్ లో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే బీజేపీ స‌ర్కార్ కు లేఖ రాశారు.

దేశ వ్యాప్తంగా 25 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు రాశార‌ని, కేవ‌లం బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజ‌స్తాన్ , మ‌ధ్య ప్ర‌దేశ్, హ‌ర్యానా రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థుల‌కే ఎలా ర్యాంకులు వ‌స్తాయో చెప్పాల‌ని నిల‌దీశారు. దీని వెనుక ఏం జ‌రిగింద‌నే దానిపై వెంట‌నే ఎంక్వైరీ వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కేటీఆర్.

ల‌క్ష‌లాది మంది విద్యార్థుల భవిష్య‌త్ ప్ర‌మాదంలో ప‌డినా కేంద్రం ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందర గోళం.. మరో వైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెల‌కొంద‌న్నారు కేటీఆర్.

పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు నీట్ వ్యవహారంపై స్పందించాల‌ని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు.