వదినమ్మకు పవన్ వందనం
జనసేన పార్టీ చీఫ్ సంతోషం
హైదరాబాద్ – జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. తను కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందడంతో మెగా ఫ్యామిలీలో అంతులేని సంతోషం వ్యక్తం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో 21 శాసన సభ స్థానాలతో పాటు 2 లోక్ సభ స్థానాలను గెలుపొందేందుకు అహర్నిశలు శ్రమించాడు. చివరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయిలో స్థానాలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సీఎంగా కొలువు తీరితే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏకంగా ఊహించని రీతిలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు . ఈ సందర్బంగా తాను ఎంతగానో అభిమానించే అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు పొందారు. ఆపై తన వదినె సురేఖ ప్రేమను పొందారు. ఇదిలా ఉండగా
పవన్ కళ్యాణ్ కు వదిన గిప్ట్ ఇచ్చింది మరిది పవన్ కు.
ఆ బహుమానం ఏమిటంటే రూ. 3.15 లక్షలు విలువ చేసే డిస్నీ లిమిటెడ్ ఎడిషన్ మోంట్ కు చెందిన పెన్నును అందించారు.