ENTERTAINMENT

బాబు ముందు చూపు సూప‌ర్

Share it with your family & friends

కితాబు ఇచ్చిన సినీ డైరెక్ట‌ర్

హైద‌రాబాద్ – తెలుగు సినీ చిత్ర ద‌ర్శ‌కుడు, సోని లివ్ ఛాన‌ల్ కంటెంట్ హెడ్ మ‌ధుర శ్రీ‌ధ‌ర్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆయ‌న తాజాగా ఏపీలో కొత్త‌గా కొలువు తీరిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఆకాశానికి ఎత్తేశారు. అంతే కాకుండా ఆయ‌న‌కు ఉన్న ముందు చూపు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇలాంటి విజ‌న్ క‌లిగి ఉండ‌డం గొప్ప‌నైన విష‌య‌మ‌ని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాలు ‘కుల గణన’ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు చేపట్టిన అత్యంత ప్రగతిశీల కార్యక్రమం ‘నైపుణ్య గణన’ అద్భుత‌మ‌న్నారు. రాష్ట్రానికి నైపుణ్యం కలిగిన యువతకు ఇది ఎలా సహాయ పడుతుందో నేను ఊహించగలనని పేర్కొన్నారు.

ప్ర‌త్యేకించి ఏపీలో త‌మ సంస్థ‌ల‌ను, కంపెనీల‌ను ఏర్పాటు చేయాల‌ని అనుకునే వారికి ఈ ప్ర‌క‌ట‌న ప‌ట్ల మ‌రింత ఉత్సాహం చూపించే ఛాన్స్ ఉంద‌న్నారు మ‌ధుర శ్రీ‌ధ‌ర్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా తాను 2009లో చంద్ర‌బాబు నాయుడును క‌లుసుకున్నాన‌ని, ఆ స‌మ‌యంలో నైపుణ్య జ‌నాభా గ‌ణ‌న గురించి చెప్పార‌ని తెలిపారు.

ఆనాటిది ఇవాళ ఆచ‌ర‌ణ‌లోకి రావ‌డం నిజంగా త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు డైరెక్ట‌ర్.