సీనియర్లకు రెండు సార్లు దర్శనం
టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల – రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో టీటీడీలో ప్రక్షాళన మొదలైంది. నిన్నటి దాకా తిరుమల పుణ్య క్షేత్రం రాజకీయాలకు వేదికగా మార్చేసిన ఘనత గత వైసీపీ సర్కార్ ది. ప్రత్యేకించి ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొలువు తీరిన ఐదేళ్లలో ఈ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించారంటూ ఆరోపించారు స్వయంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు.
దీంతో ఇప్పటి వరకు టీటీడీ ఈవోగా ఉన్న ఏవీ ధర్మా రెడ్డిపై వేటు వేశారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జె. శ్యామలా రావును నియమించారు. దీంతో తిరుమల కొండపై ప్రక్షాళన ప్రారంభమైంది. ఇవాళ భక్తులకు, ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ కు తీపి వార్త చెప్పింది టీటీడీ.
రోజుకు రెండు సార్లు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి దర్శన సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆఫ్ లైన్ లో టికెట్లను ప్రారంభించింది.
ఆధార్ ను తీసుకు వెళ్లండి..ఎస్1 కౌంటర్ లో చూపించాల్సి ఉంటుంది. ఉచితంగా దర్శన భాగ్యం కల్పిస్తోంది. క్యూలో కూర్చున్న సమయంలో సీనియర్ సిటిజన్లకు సాంబారు అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు ఇస్తారు. ఒక్కో భక్తుడికి రూ. 10 చొప్పున 2 లడ్లు ఇస్తారు. అదనంగా కావాలంటే రూ. 25 కు ఇవ్వనున్నట్లు తెలిపింది టీటీడీ.