ఈవీఎంలు వాడితే ప్రమాదం
ఎలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
అమెరికా – ట్విట్టర్ సీఈవో, టెస్లా చైర్మన్ , స్టార్ లింక్ ఫౌండర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా జరిగిన ఎన్నికల నిర్వహణపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రధానంగా ఈవీఎంల పనితీరు గురించి అనుమానం వ్యక్తం చేశారు. వీటిని వాడకండి అంటూ సూచించారు.
ప్రస్తుతం ఎలోన్ మస్క్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీనిపై పెద్ద దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మండి పడుతున్నాయి. 2014, 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఈవీఎంలే కారణమని విమర్శలు ఉన్నాయి.
ఈవీఎంలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత టూల్ ను ఉపయోగించి హ్యాక్ చేసేందుకు అవకాశం ఉందని హెచ్చరించారు . ఇది నిజం కాదంటూ కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తప్పు పట్టారు.
ఇది పక్కన పెడితే రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ , ప్రియాంక గాంధీ సైతం ఈవీఎంల గాంబ్లింగ్ పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.