టీమిండియా కోచ్ గా గంభీర్..?
అంగీకరించిన బీసీసీఐ
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎవరిని టీమిండియాకు కోచ్ గా నియమించాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం భారత జట్టు అమెరికా, విండీస్ లో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ ఆడుతోంది. ఇప్పటికే దాయాది పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు తను మెంటార్ గా, కోచ్ గా ఉన్నాడు గంభీర్. ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. ఎంపీగా కూడా పని చేశాడు. ప్రస్తుతం గంభీర్ ను కోచ్ గా నియమించాలని బీసీసీఐ పట్టు పడుతోంది. ఇప్పటికే బీసీసీఐ కార్యవర్గ సమావేశంలో తీవ్రమైన చర్చ జరిగింది.
ఇప్పటి వరకు సున్నిత మనష్కుడైన రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు కోచ్ గా ఉన్నాడు. ఈ సమయంలో మరింత బలంగా జట్టును తీర్చి దిద్దే కోచ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది బీసీసీఐ. ఇదే క్రమంలో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ గౌతమ్ గంభీర్ వైపు బీసీసీఐ సెక్రటరీ జే షా మొగ్గు చూపుతున్నట్లు టాక్.
తను కొన్ని డిమాండ్లు ముందు పెట్టాడని వాటికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. తనకు సపోర్ట్ స్టాఫ్ కూడా కావాలని పట్టు పట్టినట్లు టాక్.