DEVOTIONAL

టీటీడీ నూత‌న ఈవోగా శ్యామ‌ల రావు

Share it with your family & friends

బాధ్య‌త‌లు అప్ప‌గించిన ఏవో ధ‌ర్మా రెడ్డి
తిరుమల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) నూత‌న కార్య నిర్వ‌హ‌ణ అధికారి (ఈవో)గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి నుండి బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

అనంత‌రం నూత‌న ఈవో తన సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత జేఈఓ వీరబ్రహ్మం ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

కాగా, తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామివారిని ఈవో దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు.

ఈ కార్యక్రమంలో జెఈఓ గౌతమి, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, సిఇ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.