DEVOTIONAL

అన్న ప్రసాదాన్ని తనిఖీ చేసిన ఈవో

Share it with your family & friends

పాల‌నా ప‌రంగా చ‌ర్య‌ల‌కు దిగిన శ్యామ‌ల రావు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న ఈవోగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ జె. శ్యామ‌ల రావు. అనంత‌రం ఆయ‌న క్యూ లైన్ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి ఉన్న ఇబ్బందుల‌ను తెలుసుకున్నారు.

అక్క‌డి నుండి నేరుగా స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అటు నుంచి తిరుమ‌ల లోని మాతృశ్రీ శ్రీ త‌రిగొండ వెంగమాంబ అన్న ప్ర‌సాద స‌ముదాయం వ‌ద్ద‌కు వెళ్లారు. రాత్రి భ‌క్తుల‌తో క‌లిసి ఈవో జె శ్యామ‌లా రావు భోజ‌నం చేశారు.

క్యూ లైన్ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ఎంటీవీఏసీని సందర్శించి నిల్వ ఉంచడం, వంట చేయడం, వడ్డించే విధానాలను ద‌గ్గ‌రుండి చూశారు. సంబంధిత అధికారులకు కొన్ని విలువైన సూచనలు చేశారు.

అనంతరం భక్తులతో ప్ర‌సాదాన్ని రుచి చూసి వారి అభిప్రాయాలను సేకరించారు. నూత‌న ఈవో వెంట
ఆరోగ్య, విద్యా శాఖ జేఈవో గౌతమి, సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌, టీటీడీ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు