సీఎం యోగి భావోద్వేగం
కొడుకును చూసి తల్లి కంటతడి
రిషి కేశ్ – దేశానికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నది వాస్తవం. ఆయన పేరు చెబితే యూపీలో హడల్. ఆయన ఎవరో కాదు యోగి ఆదిత్యానాథ్. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆజన్మ బ్రహ్మచారి. ప్రజలతో మమేకం కావడం, వారి సమస్యలను వినడం తన కర్తవ్యం. ఏనాడూ బాధ్యతల నుంచి పక్కకు చూడని వ్యక్తి యోగి ఆదిత్యానాథ్.
కరడు గట్టిన హిందూత్వ భావజాలం కలిగిన వ్యక్తి. అంతే కాదు ఆశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యాడని పేరుంది. ఉన్నట్టుండి యోగి భావోద్వేగానికి లోను కావడం అందరినీ విస్తు పోయేలా చేసింది.
రిషి కేశ్ లో తన తల్లి చికిత్స పొందుతోంది. ఆమెను యోగి కలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. తన దగ్గరున్న కొడుకుని చూసి తల్లి సన్ గ్లాసెస్ తీసేసింది. ఇదిలా ఉండగా యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి జూన్ 7 నుండి కంటి చికిత్స కోసం ఎయిమ్స్ రిషికేశ్‌లో చేరారు.
ఒకరినొకరు చూడగానే ఇద్దరూ ఎమోషనల్ కావడంతో అక్కడి వారిని కలిచి వేసింది. అయితే సీఎం యోగి తన తల్లితో దాదాపు అరగంట సేపు గడిపారు.