హన్మంతన్న చల్లంగ ఉండాలి
సీఎం రేవంత్ బర్త్ డే విషెస్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కంగ్రాట్స్ తెలిపారు. తనపై విమర్శలు చేసినా లైట్ గా తీసుకున్నారు పీసీసీ మాజీ చీఫ్ , సీనియర్ నేత వీ హనుమంత రావును. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా పార్టీ సారథ్యంలో పలువురు నాయకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
వి. హనుమంత రావుకు పూల బొకే ఇచ్చి అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. మనసులో ఏదో ఒకటి పెట్టుకుని రాజకీయాలు చేసే వాళ్లకంటే తను బెటర్ అని పేరు పొందారు. బహుజన నేతలలో ఒకడిగా గుర్తింపు పొందారు. చాన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఆయన భాష, యాస అచ్చం తెలంగాణను పోలి ఉంటుంది.
అందుకే ఏ పార్టీకి చెందిన వారైనా సరే అందరూ ఆప్యాయంగా వి. హనుమంత రావును హన్మంతన్నా అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. తనకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వీహెచ్.