కొలువు తీరిన నారాయణ రెడ్డి
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్
నల్లగొండ జిల్లా – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 20 మంది ఐఏఎస్ ఆఫీసర్ లను బదిలీ చేసింది. పాలనా పరంగా పర్ ఫార్మెన్స్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు కొత్త వారికి కూడా ఛాన్స్ ఇచ్చింది సర్కార్.
గత సర్కార్ లో కొందరిపై ఆరోపణలు వచ్చాయి. మరికొందరు సెక్రటేరియట్ కే పరిమితం కాగా మరికొందరు కీలకమైన పదవులలో కొనసాగుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నారాయణ రెడ్డిని ఊహించని రీతిలో బదిలీ చేశారు.
సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గం ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఒకప్పుడు పాలమూరు జిల్లాలో ఉండేది. అధికార వికేంద్రీకరణలో భాగంగా విడి పోయింది. నారాయణపేట జిల్లాకు చెందిన వ్యక్తి నారాయణ రెడ్డి. కష్టపడి ఐఏఎస్ వరకు ఎదిగారు. ఆయనను నల్లగొండ జిల్లాకు బదిలీ చేశారు. ఇవాళ ఆయన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తామన్నారు.