నాన్నా మీరే మాకు స్పూర్తి
బరాక్ ఒబామాతో పిల్లలు
అమెరికా – ప్రపంచ వ్యాప్తంగా తండ్రుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు తమ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో చిన్నారుల నుంచి పెద్దల దాకా తమ తండ్రితో తమకు ఉన్న గాఢమైన బంధం గురించి గుర్తు చేసుకున్నారు. మరికొందరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే సమయంలో తండ్రి గురించి గొప్పగా ప్రశంసలు కురిపించారు కూడా.
ఇదే సమయంలో అత్యున్నతమైన అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పని చేసిన నల్ల జాతీయుడైన బరాక్ ఒబామా ఇవాళ సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. దీనికి కారణం వారి పిల్లలే. సాషా , మాలియాలు తమ నాన్నతో కలిసి ఉన్న అరుదైన ఫోటోను పంచుకున్నారు.
నాన్నా నువ్వు లేక పోతే మేం ఎలా ఉండగలం అంటూ పేర్కొన్నారు. మీరు నిత్యం తమకు స్పూర్తిగా ఉంటారని, మీ అడుగు జాడల్లో నడుస్తామని, ప్రజలకు అందబాటులో ఉంటామని స్పష్టం చేశారు . ఈ సందర్బంగా ఫాదర్స్ డే డాడీ అంటూ గ్రీటింగ్స్ తెలిపారు కూతుళ్లు.