NEWSANDHRA PRADESH

ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు

Share it with your family & friends

తెలిపిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగ నిరతికి, ధర్మబద్ధతకి, దాతృత్వానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు.

దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారని తెలిపారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటార‌ని గుర్తు చేశారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని జగన్ అభిలషించారు.

అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమం అన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నార‌ని పేర్కొన్నారు. త్యాగ గుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం అని పిలుపునిచ్చారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి.