రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు
మూడు వారాల్లో ప్రారంభం
అమరావతి – ఏపీ పురపాలిక, పట్టణ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంచలన ప్రకటన చేశారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
తాము తిరిగి పవర్ లోకి రావడంతో ఇక నుంచి రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండేందుకు వీలు లేదన్నారు. కేవలం రూ. 5 కే భోజనం, అల్పఆహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు నారాయణ. ఈ మేరకు కేవలం మూడు వారాల్లోనే అన్న క్యాంటీలను పునరుద్దరిస్తామని ప్రకటించారు.
కండీషన్ లో లేని అన్న క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. కాగా అన్న క్యాంటీన్ల టెండర్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. ఇక పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు.
ప్రపంచంలోనే అమరావతి నెంబర్ 5లో ఒకటిగా ఉండాలన్నది చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ.