రాహుల్ కామెంట్స్ షిండే సీరియస్
మీరు గెలిస్తే ఈవీఎంల తప్పు లేదా
ముంబై – మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనకు సోయి లేకుండా పోయిందన్నారు.
ప్రతిపక్షాలు తాము గెలిచిన చోట ఈవీఎంల గురించి ప్రస్తావించక పోవడాన్ని తప్పు పట్టారు. దేశ వ్యాప్తంగా అందరికీ ఒకే రకమైన ఈవీఎంలు ఉంటాయన్న జ్ఞానం లేక పోతే ఎలా అని ప్రశ్నించారు షిండే. ఇకనైనా ఆధారాలతో మాట్లాడితే బావుంటుందని రాహుల్ గాంధీకి సూచించారు సీఎం.
ఇదిలా ఉండగా ఈవీఎంలు క్షేమం కాదంటూ ప్రముఖ బిలియనీర్, ట్విట్టర్ చైర్మన్ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. గత కొంత కాలం నుంచీ రాహుల్ తో పాటు పలువురు సీనియర్ విపక్ష నేతలు తప్పు పడుతున్నారు.
ఈవీఎంలను టాంపరింగ్ చేసి మోడీ పవర్ లోకి వచ్చారంటూ రాహుల్ ఆరోపించారు. దీనిపై మండిపడ్డారు సీఎం షిండే. రాహుల్ కామెంట్స్ లో వాస్తవం లేదన్నారు. తాము ఓడి పోయిన వాటి గురించి ఏమంటారంటూ నిలదీశారు.