NEWSANDHRA PRADESH

హొం మంత్రికి గ్రాండ్ వెల్ క‌మ్

Share it with your family & friends

వంగ‌ల‌పూడి అనిత‌కు ఆద‌ర‌ణ

అమ‌రావ‌తి – రాష్ట్ర హోం శాఖ మంత్రిగా కొలువు తీరారు వంగ‌ల‌పూడి అనిత‌. ఆమెకు ఊహించ‌ని రీతిలో పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క‌మైన శాఖ‌ను అప్ప‌గించారు. ఇదే స‌మ‌యంలో అనిత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా త‌న వాయిస్ వినిపించారు. కానీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. పోరాడుతూనే వ‌చ్చారు. చివ‌ర‌కు తాను పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యేగా గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశారు.

కూట‌మి కేబినెట్ లో సీఎం , డిప్యూటీ సీఎంతో పాటు 23 మందితో కేబినెట్ రూపొందించారు. ఇందులో కీల‌క‌మైన హోం శాఖ ద‌క్కింది వంగ‌ల‌పూడి అనిత‌కు. మంత్రిగా స‌చివాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంత‌రం త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గానికి విచ్చేశారు అనిత‌.

ఈ సంద‌ర్బంగా పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఆమెకు దారి పొడ‌వునా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పాయ‌క‌రావుపేట‌లో పేరు పొందిన శ్రీ పాండు రంగ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు హోం శాఖ మంత్రి.