DEVOTIONAL

ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి ఉత్స‌వాలు

Share it with your family & friends

చిన్న శేష వాహ‌నంపై ఊరేగిన స్వామి వారు

తిరుప‌తి – తిరుప‌తి ప‌రిధిలోని అప్ప‌లాయ‌గుంట‌లో వెల‌సిన కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే అప్ప‌లాయ‌గుంటలో వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు.

చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. ఉదయం 8 గంట‌లకు స్వామి వారు ఐదు తలల వాహనంపై స్వామి వారు ఊరేగారు..

చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పాంచ భౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచ శిరస్సుల చిన్న శేషుని దర్శనం మహా శ్రేయస్కరం.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరిగింది. వాహ‌న‌సేవ‌లో ఆల‌య ఏఈవో ర‌మేశ్, సూపరింటెండెంట్‌ శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.