వేంకటేశ్వరుడికి వెండి ఉయ్యాల
డిప్యూటీ ఈవోకు బహూకరించిన భక్తులు
తిరుపతి – తిరుపతిలోని అప్పలాయకుంటలో కొలువు తీరిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అత్యంత ప్రకృతి సిద్దంగా ఉంటుంది ఈ ఆలయం. దీనిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం..నమ్మకం కూడా.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామికి భక్తుడు ఏకంగా రూ. 4 లక్షల విలువ చేసే వెండితో తయారు చేసిన ఉయ్యాలను బహూకరించారు. తిరుపతికి చెందిన హేమంత్ స్వామి వారికి ఏకాంత సేవలో వినియోగించు కునేందుకు గాను దీనిని ఇచ్చినట్లు డిప్యూటీ ఈవో గోవింద రాజన్ వెల్లడించారు.
ఈ సందర్బంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు గోవింద రాజన్. ఇదిలా ఉండగా వెండి ఉయ్యాలను బహూకరించిన హేమంత్ ను ప్రత్యేకంగా అభినందించారు.