NEWSANDHRA PRADESH

ష‌ర్మిల‌కు కేసీ దిశా నిర్దేశం

Share it with your family & friends

పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టాలి

న్యూఢిల్లీ – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గేను వైఎస్ ష‌ర్మిలా రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఆయ‌న‌తో పాటు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తో కూడా ములాఖ‌త్ అయ్యారు.

రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం ఎలా అనే దానిపై చ‌ర్చించామ‌ని తెలిపారు. అంతే కాకుండా త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ రూపొందించ‌డంలో ఫోక‌స్ పెడ‌తామ‌ని స్పష్టం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఈ సంద‌ర్బంగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, కేసీ వేణు గోపాల్ త‌న‌కు అమూల్య‌మైన స‌ల‌హాలు అంద‌జేశార‌ని తెలిపారు.

. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోషించే పాత్ర మ‌రింత‌ ప్రాముఖ్యం సంతరించు కుంటుందని, దానికి వారి మద్దతు అన్నివేళలా ఉంటుందని హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇదిలా ఉండ‌గా ఈసారి ఎన్నిక‌ల్లో అనూహ్యంగా పార్టీ పుంజుకుంది.

వైఎస్ ష‌ర్మిల రాక‌తో ఒక్క‌సారిగా రాజ‌కీయాల‌లో కొంత మార్పు క‌నిపించింది. ఆమె ఎంపీగా పోటీ చేసి ఓట‌మి చెందారు. పార్టీ బ‌లోపేతంపై కేసీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు.