ఆదాయపు పన్ను రేట్లు తగ్గేనా
కొలువు తీరిన ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ – అందరి దృష్టి కేంద్రంలో కొలువు తీరిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టినా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఆమె ఉన్నది కేవలం ప్రభుత్వ రంగ ఆస్తులను తనఖా పెట్టడం, లేదంటే గంప గుత్తగా పెట్టుబడిదారులకు, బిలియనీర్లకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం చేస్తూ వచ్చింది.
పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఎలాంటి పథకాలు తీసుకు రాలేదు. రాను రాను ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైనా ఇంకా డిజిటల్ జపం చేయడం మాత్రం మానుకోవడం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
ఇక వినియోగ వృద్ధి మందగించిన నేపథ్యంలో వినియోగాన్ని పెంచడానికి, మధ్యతరగతి వారికి పొదుపును పెంచడానికి ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడాన్ని ప్రభుత్వం పరిగణించే ఛాన్స్ ఏమైనా ఉందా అని ఎదురు చూస్తున్నారు.
సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ సంభావ్య పన్ను తగ్గింపును జూలై 2024 లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ప్రతిపాదించనున్నట్టు టాక్.