లోకేష్ ప్రజా దర్బార్ సూపర్
ప్రజలతో మంత్రి ముఖాముఖి
అమరావతి – రాష్ట్రంలో మంత్రిగా కొలువు తీరిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు నారా లోకేష్. ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ఆ వెంటనే ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే మంగళగిరిలోనే మకాం వేశారు. అక్కడి నుంచే మోనిటరింగ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టారు. అంతే కాకుండా ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు. ప్రతి రోజూ ప్రజల నుండి వినతలు స్వీకరిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఆ వెంటనే వాటి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
ఆయా శాఖల వారీగా సమీక్షలు చేపట్టడం, సాధ్యమైనంత వరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చూస్తున్నారు మంత్రి నారా లోకేష్. అంతే కాకుండా తన దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
మంగళగిరి ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానని నేను ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.