పవన్ కు గ్రాండ్ వెల్ కమ్
రేపే బాధ్యతల స్వీకరణ
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. వారిని పరిచయం చేసుకున్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎంగా బుధవారం పవన్ కళ్యాణ్ సంతకం చేస్తారు. బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ప్రజల సాక్షిగా.
గతంలో ఓటమి పాలైనా ఎక్కడా తగ్గకుండా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే యుద్దం చేశాడు. ఆ తర్వాత కీలకమైన పాత్ర పోషించారు ఏపీ రాజకీయాలలో.
పవన్ కళ్యాణ్ ను అందరూ తక్కువగా అంచనా వేశారు. కానీ చంద్రబాబుతో పొత్తు పెట్టు కోవడంతో పాటు బీజేపీని జత కట్టేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. మూడు పార్టీల ఫార్ములా వర్కవుట్ అయ్యింది. ఏకంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 164 సీట్లు గెల్చుకున్నాయి.