30న పీఎం మన్ కీ బాత్
ప్రకటించిన నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా అత్యంత పేరు పొందిన కార్యక్రమంగా నిలిచింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే మన్ కీ బాత్. రేడియోను శక్తి వంతమైన సాధనంగా మల్చుకున్న ఏకైక పీఎంగా ఆయన గుర్తింపు పొందారు. ఆయనను చూసి చాలా మంది దేశాధినేతలు, పీఎంలు సైతం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపించడం విశేషం.
ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాన మంత్రి మోడీ ప్రతి నెలా నెలా నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ఆగి పోయింది. కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ కారణంగా ఆయన దీనికి దూరంగా ఉన్నారు.
తాజాగా మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. తను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం జూన్ 30న ఆదివారం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
143 కోట్ల మంది భారతీయులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తితో వింటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి.