ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్
విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి – ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శాసన మండలిలో ఖాళీ అయినత రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికలు వచ్చే నెల జూలై 12న ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించింది సర్కార్. ఈ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని తెలిపింది.
అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది . ఇదిలా ఉండగా సి. రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ లపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్యేల కోటా కింద ఎన్నికైన తమ ఎమ్మెల్సీ పదవుల నుంచి దిగి పోవాల్సి వచ్చింది. కాగా ఖాళీ అయిన స్థానాలకు తప్పక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల కాలంలో ఎన్నికలు విధిగా చేపట్టాలి.