టికెట్ల ధరల పెంపునకు ఓకే
గుంటూరు కారం యూనిట్ ఖుష్
అమరావతి – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కలిసి నటించిన గుంటూరు కారం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో టికెట్లు ముందస్తుగా అమ్ముడు పోయాయి. విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్సాన్స్ వచ్చింది. గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి.
మూవీ విడుదలను పురస్కరించుకుని టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో గుంటూరు కారం చిత్ర యూనిట్ సంతోషానికి లోనైంది.
మహేష్ బాబు సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రిన్స్ కాంబినేషన్ లో గుంటూరు కారం చిత్రం వస్తోంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టు తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇప్పటికే థియేటర్ల వద్ద బ్యానర్లు, పోస్టర్లతో హోరెత్తిస్తున్నారు.
మహేష్ బాబుకు ప్రత్యేకించి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అందుకే ఏరికోరి ఈ పండుగను పురస్కరించుకుని సినిమాను రిలీజ్ చేస్తున్నారు. చాలా మటుకు థియేటర్లన్నీ పూర్తిగా నిండి పోతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా అతడు, ఖలేజా సినిమాలను మించి ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.