NEWSANDHRA PRADESH

ఆ ముగ్గురినీ తొలగించాలి

Share it with your family & friends

మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ

అమరావతి – మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామ‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో కొలువు తీరిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ విద్యా వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేసింద‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్బంగా విద్యా శాఖ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించిన పాఠ‌శాల విద్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఎసీసీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్య సచివాలయంలో జేడీ సర్వీసెస్ కింద పని చేస్తున్న రామలింగంను వెంటనే ఆ స్థానాలను నుంచి తప్పించాలని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేర‌కు మాజీ ఎమ్మెల్సీ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. 117 జీవో ద్వారా 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి, చాలా పాఠ శాలు మూల పడటానికి, వేల సంఖ్యలో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరగడానికి కారణమైన ప్రవీణ్ ప్రకాశ్ నాడు-నేడు, విద్యా కానుక పథకాల్లో అవినీతికి పాల్పడ్డా రని ఆరోపించారు.

2019లో కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భార్యను నిలబెట్టిన ప్రతాప్రెడ్డి టీచర్లను బెదిరించి, ఓట్లు వేయించుకోవడం, ప్రభుత్వ అధికారి అయి ఉండి, వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించడం చేశారని ఆరోపించారు.

జేడీ సర్వీసెస్ రామలింగం నాటి విద్యా శాఖ మంత్రికి, టీచర్లకు మధ్య బ్రోకర్లా మారి, అక్రమ బదిలీలకు భారీగా నిధులు వసూలు చేశాడని మండిప‌డ్డారు మాజీ ఎమ్మెల్సీ.