చంద్రబాబుపై అంబటి ఫైర్
సీఎం చెప్పినవన్నీ అబద్దాలే
అమరావతి – మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పోలవరం పర్యటన ఎందుకు చేశారో ఆయనకే తెలియాలని అన్నారు. పోలవరంపై సీఎం చెప్పినవన్నీ అబద్దాలేనంటూ ఎద్దేవా చేశారు.
తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం తగదన్నారు. దీనిని మార్చుకుంటే మంచిదని సూచించారు చంద్రబాబు నాయుడుకు అంబటి రాంబాబు.
పోలవరాన్ని పూర్తి చేసేందుకు నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అంత సమయం ఎందుకు తీసుకుంటుందని ప్రశ్నించారు. అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా తను ఆచి తూచి మాట్లాడితే మంచిదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.