గంజాయిని అడ్రస్ లేకుండా చేస్తాం
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – రాష్ట్రంలో విచ్చల విడిగా విక్రయిస్తున్న గంజాయిని అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. మంగళవారం ఆమె తన సచివాలయంలో హోం శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అనిత. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. గత సర్కార్ పెంచి పోషించిందే తప్పా చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు.
గంజాయిని అరికట్టాలంటూ లెక్కలేనన్ని వినతలు తమకు వచ్చాయని చెప్పారు హోం శాఖ మంత్రి. దీని కారణంగా విశాఖలో క్రైమ్ రేట్ మరింత పెరిగిందని చెప్పారు. ఇక నుంచి ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవాళ్టి నుంచి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు.
హోం శాఖను జగన్ రెడ్డి భ్రష్టు పట్టించారని, వారికి కనీస సౌకర్యాలు లేవని, వాటిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వంగలపూడి అనిత.